Transfer Certificate

“మేడమ్, నేను TC (Transfer Certificate) వారం రోజుల లోపు ఇవ్వకపోతే ఉద్యోగం పోతుంది. RRB (Railway Recruitment Board) వాళ్ళు వారం లోపు TC తీసుకొని వచ్చి RJC (Railway Junior College) లో join అవ్వమన్నారు. TC రాకపోతే నాకు వచ్చిన ఉద్యోగ అవకాశం పోతుంది. Please నాకు TC ఇప్పించండి మేడమ్”

“మాకు ఉన్న ఆర్థిక పరిస్థితికి మా నాన్న నన్ను Inter తరువాత చదివించలేరు. నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ తరువాత నేను ఏదో విధంగా జీవితంలో ముందుకెళ్ళగలను”. కళ్ళలో నీళ్ళు తిరుగుతూవుండగా చేతులు జోడించి , వేడుకున్నాడు ఆ పదహైదు సంవత్సరాల బాలుడు. హైదరాబాద్ రావడం అదే మెుదటిసారి. తెలిసిన వాళ్ళు ఎవరూలేరు. దేవుడి మీద భారం వేసి, చదువు రానటువంటి తండ్రి, తను ఇద్దరు కలిసి వచ్చారు. అప్పటి వరకు జిల్లా కేంద్రం – కర్నూల్ నే సరిగ్గా చూడలేదు… హైదరాబాద్ అంటే మాటలా ? ఎన్నో విన్నారు హైదరాబాద్ గురించి. మోసం చేస్తారట! డబ్బులు తీసుకుంటారట! ఇంకా ఏవేవో విన్నారు.

TC కోసం JNV, Banavasi Principal ను చాలా request చేసుకున్నారు, తండ్రీ కొడుకులు. Principal ససేమిరా అన్నాడు . “వీడు చాలా బాగా చదువుతాడు. మంచి తెలివితేటలు వున్నాయి. వీడ్ని తీసుకెళ్ళి ఇప్పుడు చిన్న ఉద్యోగంలో చేర్పిస్తే ఇంక అక్కడితో చదువు ఆపి అందులోనే ఉండిపోతాడు. ఇంత బాగా చదివే వాడిని తీసుకెళ్ళి రైల్వేలో ఏదో చిన్న ఉద్యోగంలో చేర్చి వాడి జీవితం అలా ముగిస్తానంటే నేనొప్పుకోను” అంటూ ఖరాఖండిగా చెప్పేశారు Principal S.V Reddappa గారు.

అందరూ బాగా చదవాలి… ఉన్నత స్థానాలలో స్థిరపడాలి… పది మందికి ఉపయోగపడాలి అన్నది ఆయన తాపత్రయం.

“చాలీచాలని బ్రతుకులు. నవోదయ స్కూల్ పుణ్యమా అని ఇంత వరకు మంచి చదువు చదువుకోగలిగాడు. ఒక్కసారి నవోదయ అయిపోయి బయటకి వస్తే పరిస్థితి ఏంటి? చదివించాలంటే చాలా డబ్బులు కావాలి. అంత స్థోమతలేదు. ఎదో చిన్న ఉద్యోగం అయినా ముందు నాలుగు డబ్బులు సంపాదించుకోగలిగితే, తరువాత ఆ డబ్బులతో చదవచ్చు. చదవకపోయినా వాడి జీవితంలో వాడు settle అవుతాడు. మా కుటుంబంలో directగా ఉద్యోగం సంపాదించుకున్న వాడవుతాడు. అది కూడా అంత చిన్న వయస్సులోనే” అనేది తండ్రీ కొడుకుల వాదన

మధ్యేమార్గంగా రెడ్డప్ప గారు ఒక సలహా ఇచ్చారు. నేను TC ఇవ్వాలంటే నలభై రోజుల ముందు మీరు apply చేసుకొని వుండాలి. అది మీరు చెయ్యలేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు TC కావాలంటే హైదరాబాద్ లో వున్న Assistant Commissioner permission ఇస్తే నేను TC ఇవ్వగలను. మీరు వెళ్ళి Assistant Commissioner తో permission తెచ్చుకోండి.

ఊర్లో వున్న చదువుకున్న వాళ్ళందరినీ అడిగాడు వాళ్ళ నాన్న – తనకు తోడుగా హైదరాబాద్ రమ్మని తను చదువుకోలేదు. ఆ Assistant Commissioner office ఎక్కడో తెలియదు. అక్కడికి ఒకవేళ వెళ్ళినా ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో తెలియదు.

వెంకటన్న పుట్టిన మూడు సంవత్సరాలకే తల్లి చనిపోయింది. దానికి తోడు ఒక చిన్న చెల్లెలిని తనకు వొదిలి; ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ, తినిపించుకుంటూ, ఊహ తెలిసినప్పటినుండి జీతాలకు వుంటూ పెరిగాడు. ఊరు దాటి బయటికి వచ్చింది చాలా తక్కువ.

మొదటి సారి చిన్న కొడుకు చంద్రుడు నవోదయ స్కూలుకు select ఆయితే join చేయించడానికి వచ్చాడు. దాదాపు 150km పైన వుంటుంది బనవాసి, కోటపాడు నుండి. అప్పుడు చూశారు తండ్రీ కొడుకులు జిల్లా కేంద్రం- కర్నూలును.

ఇప్పుడేమో ఏకంగా జిల్లా కేంద్రం దాటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్ళాలట. ఒక వైపు job linked vocational course (VCRC-Vocational Course in Railway Commercial) కు select అయినందుకు సంతోషంగా వున్నా, ఇంకో వైపు వాడి మీద కోపంగా కూడా వుంది ఆ తండ్రికి – లెక్కకు మించి పనులు చెయ్యాల్సివచ్చినందుకు.

అందరు వస్తాము, సహాయం చేస్తాము అన్నారు. తీరా బయలుదేరాల్సి వచ్చిన రోజు ఏదో పనివుందని చెప్పి తప్పించుకున్నారు.

తండ్రీ కొడుకులకు తప్పలేదు. భయం భయంగా ఇద్దరూ బయలుదేరి వచ్చారు. సాధ్యమైనన్ని details వారినుండి వీరినుండి కనుక్కున్నారు, హైదరాబాద్ గురించి, అక్కడి పద్ధతుల గురించి. ఎలాగోలా కష్టపడి, వారిని వీరిని అడిగి హైదరాబాద్ లో వున్న Assistant Commissioner office కి వచ్చారు. ఓ రెండు మూడు గంటలు చూసిన తరువాత వారికి లోపలికి రమ్మని పిలుపు వచ్చింది.

చేతులు కట్టుకొని నిలబడి, కళ్ళలో నీళ్ళు బలవంతంగా ఆపుకుంటూ చెప్పాడు – జరిగినదంతా. “TC కావాలి. లేకపోతే నాకు వచ్చిన ఉద్యోగం పోతుంది. మీరే సహాయం చెయ్యాలి “ అని. Assistant Commissioner శ్యామల గారు – ఆ అబ్బాయి చెప్పిందంతా శాంతం గా విన్నారు.

అంతా విని కుర్చీలో నుండి లేచి వచ్చి, ఆ అబ్బాయి భుజం మీద చెయ్య వేసి, “ఏం భయపడవద్దు… నేనున్నాను. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. నీక్కావలిసిన TC వెంటనే ఇవ్వమని చెబుతాను మీ principal కు” అంటూ ఫోన్ తీసి JNV, Principal కు phone లో చెప్పేశారు. మనస్సు ఒక్కసారిగా తేలికపడింది. ఆ అబ్బాయి మనసులో ఎగిరి గంతేశాడు గట్టిగా. మేడమ్ కు థ్యాంక్స్ చెప్పి అక్కడినుండి బయటకి వచ్చారు.

అదే అబ్బాయి తరువాత Civils రాయడం -IAS అవ్వడం-తన రాష్ట్రానికే allot అవ్వడం-ఇప్పుడు అనంతపురం Collector గా వుండడం. ఆంతా నమ్మశఖ్యంకాని నిజం.

జిల్లా కలెక్టర్ Navodaya School – Vidyalaya Managment Committe (VMC) కి Chairperson గా వుంటారు. తను చదివినటువంటి స్కూల్ కి తానే Chairperson హోదాలో ఈ మధ్యనే వెళ్లిరావడం జరిగింది.

ఆ రోజు సహాయం చేసినటువంటి శ్యామల లాంటి అధికారులకు, మాతృ మూర్తులందరికీ నమస్కారాలు.

Leave a Reply

Your email address will not be published.

Translate »