లే పద పద…!

కొన్ని సినిమాలు చూసినప్పుడు అందులో వున్న incidents మన జీవితానికి ఎంత దగ్గరగా వున్నాయో తెలుస్తాయి. నేను ఈ మధ్య కాలంలో MS DHONI – The Untold Story చూస్తున్నప్పుడు అలాంటి అనుభూతే కలిగింది. MS DHONI, exams – office league final rounds selections మధ్య చేసిన ఏడు రోజుల struggle చూస్తున్నంత సేపు , జీవితంలో నేను చేసిన అటువంటి ఏడు నెలల struggle నా మదిలో గిర్రున తిరిగింది.

MS Dhoni…

Ticket Collector నుండి Indian Cricket Team Captain.

Gandam Chandrudu…

Ticket Collector నుండి District Collector.

పోలిక అక్కడితో ఆగలేదు .

జూన్ 1999, MS Dhoni కి Board Exams వున్న Time లోనే Under -19 Office league last round selections కూడా జరుగుతూవుంటాయి. పరీక్షలు ఉదయం 8 నుండి 11 గంటల వరకైతే , Office league selections ఉదయం 11 గంటలకు start అవుతాయి . అవి attend అవ్వాలంటే మూడుగంటలలో వ్రాయాల్సిన పరీక్షను, 2.30 గంటలలో ముగించి , friends సహాయంతో Bike లో 10.45 కు వున్న Passenger Train పట్టుకొని 11 గంటలకు Office league selection కు attend అవుతాడు.

ఎగిరేవు నువ్వు మేఘాలపైకి

నీ దమ్ము నువ్వే గుర్తించితే

నీలోని శక్తి నీ యావదాస్థి

నిన్నాప తరమా చెలరేగితే

అంటూ background లో పాట Situation కి తగినట్టు వుంటుంది.

Dhoni ఆవిధంగా కష్టపడతాడు. నేనూ అదేవిధంగ కష్టపడ్డాను. ఒకే ఒక తేడా ఏంటంటే ధోని ఏడురోజులు కష్టపడ్డాడు. నేను ఏడు నెలలు అలా కష్టపడ్డాను. అంతే తేడా!!

2009 వ సంవత్సరం … అశోక్ నగర్, హైదరాబాద్ …. RC Reddy IAS Study సర్కిల్

సార్ , నా suitcase ఇక్కడ పెట్టుకోవచ్చా ?

suitcase తో క్లాస్ కి ఎందుకు వచ్చారు?

నేను డ్యూటీ చేసి, డ్యూటీ నుంచి సరాసరి గా coaching class కు వచ్చాను. ఇంటికి వెళ్లి రావడానికి సమయం సరిపోదు . అందుకే Suitcase తో వచ్చాను.

సరే పెట్టుకోండి

టకాటకా suitcase open చేసి అందులో వున్న పుస్తకాలు తీసుకొని మళ్ళీ దాన్ని close చేసి table కింద పెట్టేశాను. Suitcase లో TTE లు వేసుకునే నల్ల కోటు , Railway emblem వున్నటువంటి Red tie , ఇతరత్ర అవసరమైన వస్తువులు మరియు Books వుంటాయి.పుస్తకాలు తీసుకొని గబాగబా వెళ్ళి class లో కూర్చున్నాను. నా వెంటే History class తీసుకుంటున్నటువంటి కరీంగారు , class కి వచ్చి చెప్పడం మొదలుపెట్టేవారు.

ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు class. రెండు గంటలు ఓపిగ్గా విని , points మిస్సవ్వకుండా notes వ్రాసుకొని , class అయిపోయినవెంటనే మళ్ళీ కరీంగారి గది కి వెళ్ళి Suitcase తీసుకొని, అందులో పుస్తకాలు పెట్టుకొని , ఇంటికి బయలుదేరేవాడిని .

RC Reddy IAS Study Circle నుండి , కవాడిగూడలో వున్న ఇంటికి ఒకటిన్నర కిలోమీటరు దూరం .

ఇంచుమించు పదికేజిల బరువున్న suitcase ను మోసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే వాడిని. ఇంటికి వెళ్ళే సరికి 10.00 – 10.30 టైం అయ్యేది. భోజనం చేసి పడుకుంటే మళ్ళీ మూడున్నర నాలుగుకు లేచేవాడిని. లేచి ready అయ్యి భోంచేసి మళ్ళీ Suitcase సర్దుకుని Coaching class కి బయలుదేరే వాడిని నడుచుకుంటూ; ఓ అరగంట నడక తరువాత RC Reddy IAS Study circle కి reach అయ్యేవాడిని. మళ్ళీ suit case ని subject చెప్పేటటువంటి Professor గది లో వుంచి , పుస్తకాలు తీసుకోని class లో కూర్చునేవాడిని. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఇంకో 2 గంటలు class .

Coaching class ముగించుకొని , suitcase తీసుకొని Auto ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్ళే వాడిని. రాత్రి ఎనిమిది – ఎనిమిదిన్నరకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకొని భోజనం చేసేసరికి 9.00 అయ్యేది. ఒక గంట సేపు ఉదయం , సాయంత్రం కోచింగ్ class లో చెప్పిన subjects ను కొంత చదివేవాడిని. రాత్రి డ్యూటీ పది గంటల నుండి ఉదయం ఆరు వరకు . రాత్రంతా అడపాదడపా రైళ్ళు వస్తూ వుంటాయి. నిద్రపోవడానికి కాదు కదా , కనీసం కొద్ది సేపు విశ్రాంతి తీసుకోడానికి కూడా కుదిరేది కాదు.

రైళ్ళు వచ్చినప్పుడు gate దగ్గర నిలబడి tickets collect చేసుకోవడం , రైళ్ళు లేనప్పుడు enquiry counter లో నిలబడి వచ్చినటువంటి ప్రయాణికులకు సమాచారం అందించడం, రైల్ రాకపోకలగురించి announcements చెయ్యడం. ఇది డ్యూటీ. ఇవన్నీ కాక, మధ్యలో ఏ 20 నిమిషాలో అరగంటో సమయం దొరికితే civils పుస్తకాలు బయటికి తీసి చదువుకోవడం.

సాధ్యమైనంత వరకు చదువుకోవడానికీ ప్రయత్నం చేసేవాడిని. ఉదయం ఐదు గంటలకు main gate పక్కనేవున్న ప్రయాణికుల waiting room లోకి వెళ్ళి ముఖం కడుక్కొని ready అవ్వడం, ఆరుగంటల కు వచ్చే train యొక్క tickets collect చేసి , వాటిని TCR (Tickets Collected Report) లో రాసి, ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల డ్యూటీకి ఎక్కిన వారికి లెక్క అప్పజెప్పి , హడావిడిగా suitcase తీసుకుని బయటకు బయలుదేరేవాడిని.

ఆటో పట్టుకుని కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి అశోక్ నగర్ లో ఉన్న RC Reddy IAS Study Circle కి వచ్చేసరికి దాదాపు 7:00 గం అయిపోయేది. పెరిగెట్టుకుంటూ వెళ్లి, suitcase professor గదిలో వుంచి. పుస్తకాలు తీసుకుని క్లాస్ కు వెళ్ళేవాడిని.

మళ్ళీ 7 నుంచి 9 గంటల వరకు class -నడుచుకుంటూ కవాడిగూడలో ఉన్న ఇంటికి వెళ్ళడం-మూడున్నర – నాలుగు వరకు నిద్ర – మళ్లీ సాయంత్రం 5 గం॥ class కి వెళ్ళడం – అటునుంచి అటే కాచిగూడ వెళ్ళడం- రాత్రి డ్యూటీ చెయ్యడం – ఉదయం రైల్వేస్టేషన్ లోనే రెడీ అవ్వడం – మళ్ళీ 7am – 9am class కు రావడం.

ఇదీ నా దిన చర్య.

ఒక్క రోజు కాదు … రెండు రోజులు కాదు

ఒక్క వారం కాదు … రెండు వారాలు కాదు

ఒక్క నెల కాదు … రెండు నెలలు కాదు

ఏకంగా 7 నెలలు ఇదే routine .

Leave పెడితే జీతం రాదు. జీతం లేకుండా loss of pay లో వుంటూ చదువుకోడం కుదరదు. చదువుకోవాలంటే జీతం కావాలి. అప్పటికే 8 సంవత్సరాల రైల్వే ఉద్యోగ జీవితంలో దాచుకున్న savings అన్ని పెట్టి coaching class కి join అవ్వడం జరిగింది. బరువుకు మించిన కోచింగ్ ఫీజు, అయినా తప్పదు. కోచింగ్ లేకుండా పాస్ అవుతామో లేదో అన్న సందేహం. కోచింగ్ classes definite గా ఉపయోగపడతాయి. ఫీజు తగ్గించమని ఎంతో ప్రాధేయపడితే ఏదో లేదనకుండా కొంత తగ్గించారు కానీ, నాలాంటి వాళ్ళకి ఆ తగ్గించిన ఫీజు కూడా చాలా ఎక్కువే …

ఏమైనా పర్వాలేదు … ఎంత కష్టమైనా civils సాధించాలి. ఇక ఇప్పుడు కాకపోతే, ఇక ఎప్పటికీ చెయ్యలేను. ప్రయత్న లోపం లేకుండా నా శాయ శక్తులా ప్రయత్నిస్తాను. వస్తే మంచిది , లేదంటే ప్రయత్నం చేయలేదన్న బాధ వుండదు.

ఏదో ఒక సర్వీస్ ఖచ్చితంగా సాధించాలి … ఏమైనాసరే … అని పట్టుదలగా ఒక వైపు డ్యూటీ , మరో వైపు ఫ్రెండ్స్ ద్వారా కోచింగ్ కోసమని తీసుకున్న కొన్ని అప్పులు. అన్ని బరువులు మోసుకుంటూ చదివాను. ఒకవేళ select కాకపోతే మళ్ళీ రెండో సారి వ్రాయడానికి కావలిసిన డబ్బు కూడా లేదు ; leave దొరకదు. అప్పుల నుండి బయట పడ్డానికి చాలా రోజులు పడుతుంది.

” రైల్వేలో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం వుంది. ప్రశాంతంగా చేసుకుంటున్నావు. మళ్ళీ అవన్నీ వదిలి ఈ చదువు అవసరమా ” స్నేహితుల సలహా.

” కర్నూల్ జిల్లా నుండి, మనలాంటి సామాజిక నేపధ్యం నుండి IAS కు select అయిన వాళ్లు ఎవరూలేరు. ఇదంతా నీకవసరమా ? ఎందుకింత risk ? ఎందుకు నీకింత మొండి పట్టుదల ? ” అని బంధువులు.

” నేను ఇప్పుడు చేస్తున్న టికెట్ కలెక్టర్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండాల్సిన వాడిని. నాకు ఆ టాలెంట్ వుంది. నా సామర్ధ్యానికి తగిన స్థాయికి నేను చేరుకోవాలి ” నా ధీమా.

‘ ప్రయత్నం చేద్దాం ! వస్తే మంచిది , రాకపోతే ప్రయత్నం చేయలేదన్న అసంతృప్తి అయితే ఉండదు ‘ అని నిర్ణయించుకుని రంగంలోకి దిగాను

” సార్, నేను civils కు prepare అవుతున్నాను. Train conductorగా కానీ, squad లో కానీ వెళ్ళలేను, నాకు కాచిగూడ స్టేషన్ లోనే రాత్రి డ్యూటీ వెయ్యండి. రాత్రి డ్యూటీ చేసుకుంటూ నేను పగలు coaching class attend అవుతాను.

“ఏం చేస్తావయ్యా civils ? ప్రశాంతంగా రైల్వే ఉద్యోగం చేసుకోక” ఇదీ supervisor మొదటి స్పందన.

ఓ అరడజను సార్లు బ్రతిమాలుకున్న తరువాత ముభావంగానే ఒప్పుకున్నారు – రాత్రి డ్యూటీ వెయ్యడానికి . అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

పక్కన bomb పడినా, తెలియనంతగా లీనమయ్యి చదువుకున్నాను. నాకు వేరే ఏది – నా ఆరోగ్యం, డబ్బులు , కష్టం – ఇవేమి కనపడలేదు. అలా సాగింది నా చదువు ఆ సమయంలో.

ఆ తరువాత civils లో మంచి ర్యాంకు రావటం – IAS రావటం -ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే allot అవ్వడం – ఇప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ గా ఉండటం – అంతా మీకు తెలిసిన కథనే.

“నీలోని శక్తి నీ యావదాస్థి

నిన్నాప తరమా చెలరేగితే”

ఇది ధోనికో, చంద్రుడికో మాత్రమే కాదు, తమలో వున్న శక్తిని గుర్తించిన ,ఇది చదువుతున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

“ఎగిరేవు నువ్వు మేఘాలపైకి , నీ దమ్ము నువ్వే గుర్తించితే”

Leave a Reply

Your email address will not be published.

Translate »