సెలవులకి ఇంటికెళ్లే ఆనందం…

సెలవులకి ఇంటికెళ్లే ఆనందం…

Gandham Chandrudu

వెల్లకిలా పడుకుని ఆకాశం వైపే చూస్తూ.. నక్షత్రాలు లెక్కపెడుతున్నాడు ఆ పిల్లాడు. ఆ రాత్రి పూట అంతటి చలిలోనూ వాడి ముఖం చంద్రుని వెన్నలలో ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. అరచేతులను తలకింద పెట్టుకుని, ఓ కాలు పైకి మడుచుకుని మరో కాలుని దానిమీద వేసుకుని యువరాజులా పడుకున్నాడు. బస్‌ స్టాండ్ భవనం పైకప్పుకు పడ్డ రంధ్రంలోంచి అలా ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎంతో నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో… తన తల, అరచేతుల కింద యూరియా సంచులతో చేతులతో కుట్టిన సంచిని పెట్టుకున్నాడు. సెలవుల్లో ఇంటి దగ్గర చేయాల్సిన హోంవర్కుకు సంబంధించి అవసరమైన పుస్తకాలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగుకు ఓ ప్లాస్టిక్ బెల్ట్ కూడా ఉంది, మెడ మీదుగా, చంకల్లోకి వేసుకుని బ్యాగును సులువుగా మోసుకెళ్లేందుకు సరిపడేంత పొడుగ్గా ఉంది అది.

ఒకవేళ అలా పడుకుని గాఢ నిద్రలోకి వెళ్లిపోతే.. తన బ్యాగును ఎవరైనా తీసుకెళ్లిపోవడం? లేదా లాక్కోవడానికి ప్రయత్నిస్తే చటుక్కున లేచేలా చాలా జాగ్రత్తలు పడ్డాడు. బ్యాగుకు ఉన్న ప్లాస్టిక్ బెల్టుని మెడమీద నుండి చంకల్లోకి తగిలించుకుని పడుకున్నాడు. ఒక వేళ మెడకు మాత్రమే తగిలించుకుంటే ఎవరైనా బ్యాగును పట్టుకుని లాగితే తాను గాయపడతాడు, అలాగే అది మెడకు బిగుసుకునే ప్రమాదం కూడా ఉంది. అలా ఆలోచించే ముందు జాగ్రత్త చర్యగా చంకల్లోంచి బెల్టుని పెట్టుకున్నాడు. అలా చేస్తే ఎవరైనా తన బ్యాగును లాగినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదన్నది వాడి ధీమా.. ఈ ఆలోచనలు ఓ వైపు సాగుతుంటే.. మరోవైపు బస్టాండ్ భవనం పై కప్పుకు పడ్డ అంత చిన్నటి రంధ్రంలోంచి చుక్కలు లెక్కపెడుతున్నాడు. రంధ్రం చాలా చిన్నదే అయినప్పటికీ అందులోంచి కనిపిస్తున్న అన్ని నక్షత్రాలను లెక్కపెట్టడం సాధ్యం కాదు. ఈ వాస్తవ ఘటనకు వేదికైన ఆ బస్టాండు చాలా చిన్నది. బస్టాండు పైకప్పు సిమెంటు రేకులతో వేసినది.

బస్టాండ్ చిన్నది. సిమెంట్‌ రేకులతో వేసిన పైకప్పు కొన్ని చోట్ల విరిగి అక్కడక్కడా చిన్న రంధ్రాలు పడ్డాయి. స్తంభాల చుట్టూ వేసిన ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై ఆ పిల్లవాడు పడుకుని ఉన్నాడు. వాడి శరీరానికి టవల్ చుట్టి ఉంది. కప్పుకోవడానికి దుప్పటి లేక టవల్‌నే దుప్పటిలా ఉపయోగిస్తున్నాడు. చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, దానితోపాటే తన వస్తువులను కాపాడుకోవడానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ చలికాలం, నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలు, ఒంటరి ప్రయాణం మరియు బస్టాండ్‌లో నిద్రపోవడం ఇవేవీ సెలవులకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తోన్న ఆ పిల్లాడి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి.

అతను బస్టాండ్‌కి చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. ఆ సమయానికి వాళ్ల గ్రామం వైపు వెళ్ళే బస్సులు లేవు. చాలా వరకు హోటళ్లు కూడా మూతపడ్డాయి. ఒక వేళ హోటళ్లు తెరిచి ఉన్నా తినడానికి సరిపడినంత డబ్బులు అతని దగ్గర లేవు. పబ్లిక్‌ కుళాయిలో నీళ్లు తాగాడు. బస్టాండ్ భవనంలో పిల్లర్ చుట్టూ ఉన్న ప్లాట్‌ఫారమ్‌ను శుభ్రం చేసుకుని, తన స్కూల్ బ్యాగ్, బట్టలు మరియు ఇతరత్రా వస్తువులు ఉన్న బ్యాగు పెట్టుకుని, ఆ చలి రాత్రిలో నిద్రపోవడానికి ప్రయత్నించాడు.

వాళ్ల ఊరు తిమ్మనాయునిపేట వైపుకు వెళ్లే చివరి బస్సు 8 గంటల ప్రాంతంలో ఉంటుంది. కోయిలకుంట్ల బస్టాండ్‌కి చేరుకునే సరికి రాత్రి 9 గంటలైంది. దీంతో తిమ్మనాయునిపేట వైపు వెళ్లడానికి తరువాతి బస్సు ఉదయం 5:30 గంటలకు మాత్రమే ఉంది. అప్పటి వరకు వెళ్లి ఉండటానికి కోయిల్‌కుంట్లలో అతనికి ఎవరూ లేరు. సామాను, బరువైన స్కూల్‌ బ్యాగ్‌తో వాళ్ల వాళ్లు ఎవరైనా అక్కడ ఉన్నా కూడా ఆ సమయంలో వాటిని మోసుకుని వెళ్ళలేడు. బస్టాండ్‌లో పందులు తిరుగుతుంటే, కొన్ని కుక్కలు అప్పుడప్పుడు వాటిని తరిమివేస్తున్నాయి. హోటళ్లన్నీ మూతపడ్డాయి. బుక్ స్టాళ్లు మూతపడ్డాయి. ఆర్టీసీ సిబ్బంది కూడా వెళ్లిపోయారు. చుట్టూ భయంకరమైన చీకటి. పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, కానీ అక్కడ ఉండడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. కేవలం 12 సంవత్సరాల వయస్సులో పాఠశాల నుండి సెలవుల కోసం ఆ సమయంలో తన స్వగ్రామానికి వెళ్తున్నాడు.

. * *

స్కూల్‌కి చివరి రోజు కావడంతో అందరూ ఆనందంలో ఉన్నారు. ఈ రోజు వారంతా ఇంటికి వెళ్లొచ్చు. రాబోయే 10 రోజుల పాటు వారి అమ్మా, నాన్న అవ్వా, తాతలతో కలిసి ఉండవచ్చు. జనవరి నెల మొదటి వారంలో 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చినా, ఆ సమయంలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు సెలవుల్లో చేయాల్సిన హోం వర్క్‌ ఇచ్చేవారు. చివరి రోజున కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి, అక్కడ పిల్లలు సబ్మిట్ చేయాల్సిన వస్తువులు, ఫారమ్‌లు నింపడం మరియు ఇతర ఫార్మాలిటీలు అన్నీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి బయలు దేరాము.

వారు ఎంత వేగంగా అన్ని పనులు పూర్తి చేయాలని ప్రయత్నించినా 12 గంటలలోపు కుదరదు. మధ్యాహ్నం 12 గంటల వరకు వారు కూడా పిల్లలను వదలరు. చుట్టుపక్కల గ్రామాలు లేదా సమీప పట్టణాల్లో ఉండే పిల్లలకు ఆ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా తమ ఇళ్లకు చేరుకోవడం చాలా సులభం, కానీ 200 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉండే నాలాంటి విద్యార్థులకు స్వగ్రామాలకు చేరుకోవడానికి తరచుగా బస్సులు అందుబాటులో ఉండవు. అదే రోజు ఇంటికి చేరుకోవడం చాలా కష్టం. మా గ్రామం కోటపాడు, కర్నూలు జిల్లాకు ఆగ్నేయానికి అంచున ఉంటే, నేను చదువుకునే పాఠశాల JNV బనవాసి కర్నూలు జిల్లా వాయువ్య దిశకు మధ్యలో ఉంది. ఈ చివర నుండి ఆ చివరి వరకు 200 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని చేరుకోవడానికి, అప్పటి కాలంలో అందుబాటులో ఉన్న రహదారులతో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనికి తోడు బస్టాండ్లలో బస్సుల కోసం వేచి ఉండే సమయం అదనం.

ఇక ఎప్పటిలాగే మా నాన్న గతంలో నన్ను చూడటానికి వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు నీకు నువ్వే రావాలని చెప్పేవాడు. నిన్ను తీసుకెళ్లడానికి నేను రాలేకపోవచ్చు అనేవాడు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఉదయం 6 గంటలకు మా ఊరిలో ఉండే మొదటి బస్సులో మా నాన్న బయలుదేరినా 12 గంటలకు మా పాఠశాలకు చేరుకోలేడు. రెండవది, ఒకవేళ అయన ముందు రోజు వస్తే ఆ రోజు ఉండడానికి ఎక్కడా వసతి దొరకదు.

తల్లిదండ్రులను బడిలో నిద్ర పోవడానికి అనుమతించరు. మా నాన్న లాడ్జి తీసుకుని బయట ఉండలేరు, ఎందుకంటే అయన అంత డబ్బు చెల్లించలేడు, చెల్లించాలనుకున్నా మాకు అలాంటి ఆర్థిక స్థోమత లేదు. పైగా అందుకు మా నాన్న మూడు రోజుల కంటే ఎక్కువ జీతం ఖర్చవుతుంది, ఏ పేద కుటుంబానికైనా మూడు రోజుల జీతాన్ని వదిలిపెట్టి తమ బిడ్డను సెలవులకు ఇంటికి తీసుకువెళ్లడానికి రావడం అంటే చాలా కష్టం. అందుకే సెలవులు వచ్చినప్పుడల్లా ఆయన నాకు చెప్పేవాడు, దయచేసి నీ సొంతంగా రా, ఉపాధ్యాయులకు సెలవుల సమయంలో ఇచ్చిన కొంత డబ్బు ఇవ్వమని.

ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక ఇంటికి వెళ్లడానికి అందుబాటులో ఉన్న మొదటి బస్సును అందుకోవడానికి హడావిడిగా జవహర్ నవోదయ విద్యాలయం గేటు వెలుపల ఉన్న రోడ్డుపైకి వెళ్లేవాడిని. బస్సు వెంటనే అందుబాటులో ఉంటే, ఆ రాత్రే గ్రామం చేరుకోవచ్చు. ఆ హడావిడిలో చాలా సార్లు మధ్యాహ్న భోజనం మానేసి వచ్చేవాడిని. సెలవులు అనగానే ముందు ఇంటికి వెళ్లిపోవాలన్న సంతోషంలో మెస్‌లో మరో గంట వృధా చేయాలని ఎవరి మనస్సులో ఉంటుంది ? చాలా సార్లు మధ్యాహ్న భోజనం మానేసి, ఇంటికి వెళ్లడానికి ముందు అందుబాటులో ఉన్న బస్సును పట్టుకోవడానికి మేమంతా వచ్చి రోడ్డుపై నిలబడేవాళ్లం. బనవాసి నుండి ఎమ్మిగనూరుకు కేవలం 6 కి.మీ. ప్రయాణానికి 10 నుండి 15 నిమిషాల సమయం పట్టేది. యెమ్మిగనూరు నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు 100 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉండగా గతంలో రెండున్నర గంటలకు పైగా ప్రయాణ సమయం పట్టేది. కర్నూలు నుంచి కోయిలకుంట్లకు దాదాపు 66 కి.మీ.లు దూరం, అప్పట్లో అందుబాటులో ఉన్న రోడ్ల వల్ల ప్రయానానికి రెండు గంటల సమయం పట్టేది.


కోయిలకుంట్ల నుంచి పేరుసోములకు కేవలం 26 కి.మీ దూరం మాత్రమే ఉన్నా గంట సమయం పట్టేది. అంతా కలుపుకుని మొత్తం 200 కి.మీ దూరం ప్రయాణానికి దాదాపు ఆరు గంటల పైగా సమయం పట్టేది. అది కూడా అన్ని చోట్లా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బస్సు దొరికి, నేను ఎక్కగలిగితే. నేను ఇంటికి చేరుకోవడానికి దాదాపు సాయంత్రం 6 గంటలు అవుతుంది, కానీ అది ఎప్పుడూ జరగలేదు. ఎమ్మిగనూరు, కర్నూలు మరియు కోయిలకుంట్ల ఇలా ప్రతి బస్టాండులో మరో బస్సు దొరకడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను కోయిలకుంట్ల చేరుకోవడానికి ప్రతిసారీ రాత్రి 8:30 లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టేది. ఆ టైంకి చివరి బస్సు ఉండేది కాదు, నేను ఆ రాత్రికి బస్టాండ్‌లోనే ఆశ్రయం పొందవలసి వచ్చేది. మరుసటి రోజు ఉదయం మా గ్రామానికి వెళ్లే బస్సు ఎక్కవలసి వచ్చేది. ఆ రాత్రి ఖాళీ కడుపు నింపుకోవడానికి కోయిలకుంట్ల బస్టాండ్‌లో నీళ్లు తాగేవాడిని. రెండు పూటలా భోజనం మానేసినా, మధ్యాహ్నం రాత్రి అయినా ఇంటికి వెళ్లే ఆనందం మనసులో నిండిపోయేది.

కొన్నిసార్లు చిన్న చిన్న చిరుతిండ్లు లేదా బిస్కెట్లు కొనడానికి సరిపోయేంత డబ్బు ఉంటే, హోటళ్ళు మూసి ఉంటాయి. అందుబాటులో ఉంటే, నేను కొనుక్కుని తినేవాడిని, కానీ ఇది సాధారణంగా జరగదు. కాబట్టి ఉదయం అల్పాహారంతో ఇంటికి వెళ్లడం ప్రారంభమైతే, మరుసటి రోజు ఉదయం ఇంట్లో తినడం, అది మామూలు జరిగేది.

మరుసటి రోజు తెల్లవారుజామున దాదాపు 4.30 గంటలకే నేను లేచేవాణ్ని. ఏదేమైనా, కొత్త ప్రదేశంలో సరైన నిద్ర రాదు, బహిరంగంగా ఉండే బస్టాండ్‌, పైగా చాలా చల్లగా ఉండే ప్రదేశంలో చాలా దోమలు మన రక్తాన్ని పీల్చుకుంటాయి. కాబట్టి కొద్ది వ్యవధి నిద్రపోవడం చాలా కష్టం, ఇక ఇంటికి వెళ్లాలనే ఆత్రుతతో ఉదయం 4.30 గంటలకే నిద్రలేచేవాడిని. పబ్లిక్ బాత్రూమ్ ల వద్ద ముఖం కడుక్కోని, మా ఊరికి వెల్లే బస్సు దాని స్థానంలో ఉంచే వరకు వేచి చూసేవాడిని, బస్సు వచ్చాక కండక్టర్ మరియు డ్రైవర్ వచ్చి స్టార్ట్ చేసే వరకు అలా ఎదురుచూస్తూనే ఉంటా. ఇలాంటి పరిస్థితుల్లోనూ, బస్సు స్టార్ట్‌ కావడానికి ముందు బస్టాండులో తెరిచే బుక్‌స్టాల్‌లో వార్తాపత్రిక కొనుక్కోవడానికి నేను ఎప్పుడూ కొంత డబ్బు దాచుకునేవాడిని. కడుపులో ఎంత ఆకలితో ఉన్నా, కోయిలకుంట్ల బుక్‌స్టాల్ లో ఆ రోజు వార్తాపత్రిక లేదా ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని కొనడం మాత్రం మానలేదు.

నా సొంత గ్రామంలో గడిపే ఆ 10 రోజులు, అలాంటి ఇతర సెలవులు నా జీవితంలో చాలా సంతోషకరమైన జ్ఞాపకాలు , ఓ వైపు పాఠశాలలో గడిపే ప్రతి రోజు ప్రతి క్షణం నాకు చాలా ఇష్టం, కానీ ఇటువంటి సెలవులు ఎంతో ఆనందాలు, మధుర జ్ఞాపకాలను నింపుకున్నాయి

10 thoughts on “సెలవులకి ఇంటికెళ్లే ఆనందం…

  • June 14, 2022 at 11:20 am
    Permalink

    మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ సర్. నేను సోషల్ వెల్ఫేర్ హోటల్లో చదువుకున్న రోజులు గుర్తు చేశారు. ఇంకా కొన్ని విషయాలు రాయాలని కోరుకుంటూ.. సెలవు.

    Rajeev kachara
    CEO
    Rks Brainstorm.

    Reply
  • June 14, 2022 at 11:59 am
    Permalink

    As a teacher of JNV I have realised this problem of some students and their parents who come from longer distances to pickup their ward…… I used to allow these students to leave the campus alone without parent or escort as early as possible leaving formalities.
    Had feet in their shoe and some times spotted their financial constraints,extended financial support now and then which bestiwwdy me with profound satisfaction.

    Thank you my dear boy for motivating teachers like me….
    Blessings dear Child

    Reply
  • June 14, 2022 at 12:51 pm
    Permalink

    Inspiring memories Sir. Narration is beautiful, congratulations! Please keep writing and motivating

    Reply
  • June 14, 2022 at 2:42 pm
    Permalink

    Many many memories of my childhood, flooded my mind and your narration is so very vivid and picturesque. The little boy was smart, intelligent, loving nd responsible towards everything he has. Great read. Your photographic memory makes the readers travel alingeith you and experience your feel. Loved.

    Reply
  • June 14, 2022 at 3:41 pm
    Permalink

    You are an Iconic personality.
    An Ambedkarite. You made proud of us.

    Reply
  • June 14, 2022 at 5:44 pm
    Permalink

    Super sir u r stry I’m inspired u r life story

    Reply
  • June 14, 2022 at 11:10 pm
    Permalink

    Excellent sir. it’s an extraordinary story

    Reply

Leave a Reply

Your email address will not be published.

Translate »