The Toffee Luck

” ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో ” ప్రిన్సిపాల్ SV రెడ్డప్ప గారు ఓ మూడు toffee లు చేతిలో పెట్టాడు. ఆ toffees తీసుకొని బయటకి వచ్చాడు.

నీ admission confirm అయ్యింది. నువ్వు join అవ్వొచ్చు .

జవహర్ నవోదయ విద్యాలయకు admission రోజున ప్రిన్సిపాల్ గారు మరొక్కసారి వచ్చిన పిల్లలను, వారు correct గానే select అయ్యారా? నిజంగానే rural background నుండి వచ్చారా ? అని ఒక final test చేసి admission ను confirm చేస్తున్నారు. అప్పటికి JNVST ద్వారా select అయ్యి , JNV కి వచ్చారు పిల్లలు. కొందరు urban area వారు అయినా కూడా rural area అని application form లో చూపించడం అక్కడక్కడ ఎదురయ్యింది. అలాంటి వారు ఎవరన్నా వున్నారేమోనని join అయ్యేముందు ఒక్కసారి పిల్లలతో మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్.

అలా చంద్రుడితో కూడా మాట్లాడి ఇతడు genuine గా rural area అబ్బాయి, JNVST select అయ్యి ఇక్కడికి వచ్చాడు అని నిర్ధారించుకున్న తరువాత OK చేసాడు. ఆయన toffee తీసుకోమన్నాడంటే final test పాస్ అయినట్టే. అది ఆయన పద్దతి.

అప్పటికి చంద్రుడికి 11 సంవత్సరాలు. 6వ తరగతిలో admission కోసం JNVST రాయటం, select అవ్వటం , కోటపాడు నుండి దాదాపుగా 150 km దూరంలో బనవాసిలో వున్న జవహర్ నవోదయ విద్యాలయకు రావటం జరిగింది.

రెండవ సారి అలా toffee తీసుకోవటం … RRB టెస్ట్ pass అయ్యి VCRC interview కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు.

Vocational Course in Railway Commercial (VCRC) – ఇది ఒక job linked vocational course. 10వ తరగతి board పరీక్షలు వ్రాస్తున్నవారు దీన్ని వ్రాయటానికి అర్హులు. ఇది Railway Recruitment Board (RRB) ద్వారా నిర్వహించబడుతుంది. ఒక్కో railway zone కు ఒక్క RRB వుంటుంది. వారు ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహించేవారు. దీని ద్వారా 40 మంది ప్రతి సంవత్సరం select అవుతారు. అలా select అయిన నలభై మందిని VCRC అన్న course చదివించి , అది పూర్తి అయిన తరువాత railway లో booking clerk గానో లేదా ticket collector గానో absorb చేసుకుంటారు.

అలా JNV, బనవాసి నుండి 10వ తరగతి చదువుతున్న అందరూ 1997లో ఈ VCRC open competetive exam రాయడం, అందులో చంద్రుడు select అవ్వడం జరిగింది.

Written test లో short list అయిన తరువాత personality test కోసం లాలాగూడ లో ఉన్న RRB office కు రావడం జరిగింది.

అక్కడ ఉన్న interview board members అన్ని ప్రశ్నలు అయిపోయిన తరువాత, యాదృచ్చికంగా table మీద ఉన్న toffees తీసి ఇవ్వడం జరిగింది.

మళ్ళీ చంద్రుడు select అవ్వడం .

toffees ఇవ్వడం… చంద్రుడు select అవ్వడం … ఒక sentiment లా అనిపించింది.

UPSC interview…

ఏప్రిల్ 10th , 2010 … Afternoon session

బాలగురు స్వామి interview board .

ఓ అరగంట ఇంటర్వ్యూ తరువాత బాలగురు స్వామి గారు table మీద ఉన్న tray నుండి ఓ మూడు toffee లు తీసి ఇచ్చారు.

పక్కనేవున్న ఇంకో member అన్నారు, ” తీన్ తిగడా – కామ్ బిగడా బొల్తే , ఔర్ కుచ్ దిజియే ” అని. అప్పటికే నేను అందుకున్నాను.

“No Ma’am , కామ్ నహీ బిగడేగా” , మనసులో ఆనందపడుతూ. మంచి rank వచ్చి IAS రావటమే కాదు, సొంత రాష్ట్రానికి కూడా allot అయ్యాను .

ఈ toffees sentiment అలా workout అవుతూవుంది జీవితంలో.

Leave a Reply

Your email address will not be published.

Translate »