అంతా మన మంచికే
అందరూ multipurpose hall లో కూర్చొని ఉన్నారు. దాదాపు 80 మంది తొమ్మిదవ తరగతిలోకి అప్పుడే అడుగిడిన విద్యార్థిని విద్యార్థులు . అందరి మొహాలలో ఒకటే tension. నాపేరు లాటరీ లో రాకూడదంటే నా పేరు రాకూడదంటూ అందరూ మనస్సులో బలంగా కోరుకుంటున్న వారే.
అందరి ఎదురుగా ఒక చిన్న table. దాని మీద ఒక రెండు డబ్బాలు. ఒక దాంట్లో అందరి పేర్లు వ్రాసి వుంచిన చిట్టీలు. ఇంకొకటి empty డబ్బా. ఇద్దరు teachers table వెనుక నిలబడి ఉన్నారు.
“దీంట్లో నుంచి ఇప్పుడు చిట్టీలు తీస్తాము. ఎవరి పేరు వస్తే వారు , రాజస్థాన్ కి వెళ్ళాలి. ఒకసారి పేరు వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోను మార్చడం జరగదు”
చిట్టీలు వున్న డబ్బాను పైకెత్తి అందరికి ఒకసారి చూపించి, చిట్టీలు కలిసేలాగా దాన్ని ఊపి, అందులో నుంచి ఒక చిట్టీ తీసి పక్కన ఉన్న ఇంకో teacher చేతిలో పెట్టాడు మొదటి teacher.
అందరిలో ఒకటే tension. ఊపిరి బిగపట్టి , గుండెలమీద చెయ్యి వేసుకుని, pindrop silence తో కూర్చున్నాం అందరం.
చిట్టీ open చేసి – చదివాడు టీచర్
“గంధం చంద్రుడు “
ఒక్కసారిగా ఎలా respond అవ్వాలో తెలియలేదు. కుప్ప కూలిపోయినంత పని అయ్యింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. తరువాత మిగతా చిట్టీలు ఎన్ని తీశారో , ఎవరి పేర్లు వచ్చాయో అస్సలు వినలేదు. అక్కడ ఇంక ఏం జరుగుతుంది అన్నది complete గా మర్చిపోయి , ఇప్పుడెలా ? ఏం చెయ్యాలి ? అనుకుంటూ దీనంగా ఆలోచించ సాగాను.
” సార్, నన్ను రాజస్థాన్ పంపకండి. అవకాశం ఉంటే నన్ను ఇక్కడే మన స్కూల్లోనే వుంచండి. ” లాటరీ లో పేరు వచ్చిన తరువాత , టీచర్ ను బ్రతిమాలుకున్నాను. నాలాగే దాదాపు లాటరీ లో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ వున్న టీచర్ ను బ్రతిమాలుకున్నవారే .
కనికరించి ఏమన్నా ఆపుతారేమో అన్న చిన్న ఆశ . “లాటరీ లో పేరు వచ్చిన తరువాత ఖచ్చితంగా రాజస్థాన్ వెళ్ళాల్సిందే. లేదంటే TC తీసుకుని ఇంటికి వెళ్ళాలి”- ప్రిన్సిపాల్ ఆదేశం.
JNV , కర్నూల్ నుండి రాజస్థాన్ వెళ్లాలంటే దాదాపుగా ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. ఇక్కడ education బావుంటుంది. అన్ని వసతులు బాగుంటాయి. తల్లితండ్రులు వారానికి ఒక్కసారి రావొచ్చు.
కానీ రాజస్థాన్ నుండి మా స్కూలుకు అక్కడి విద్యార్థులు ఇష్టంగా వచ్చేవారని అందరూ అనుకునేవారు. ఇక్కడ మెరుగైన విద్య , వసతి ఇతర సదుపాయాలు వుంటాయన్నది అందరూ ఎరిగిన సత్యమే .
దాదాపు ప్రతి హిందీ speaking state నుండి ఇష్టంగా హిందీ యేతర (especially Southern India) విద్యాలయాలకు వచ్చేవారు. ఇక్కడినుండి అక్కడికి వెళ్ళాలంటే ఏడుపులు పెడబొబ్బలు. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతు.
జాతీయ సమైఖ్యతను పెంచడంతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతులను , సంప్రదాయాలను విద్యార్థి దశలోనే పిల్లలకు తెలియాలి, దాని ద్వారా cultural awareness, sensitivity పెరగడంతో పాటు భిన్న సంస్కృతులను accept చేసే విశాల దృక్పధం ఏర్పడాలన్నది JNV సమితి ఉద్దేశం.
అలా మొదట బాధ పడినా , తరువాత దాన్ని accept చేశాం అందరం. ఒక కొత్త రాష్ట్రంలో ఒక సంవత్సర కాలం పాటు చదివే అవకాశం వస్తుంది అని సర్ధి చెప్పుకుని వెళ్ళాం .
బనవాసి నుండి ఆదోనికి వెళ్లి అక్కడనుండి గుజరాత్ లోని అహ్మదాబాద్ – అటునుండి రాజస్థాన్ లోని భీన్ మాల్ అన్న రైల్వేస్టేషన్ లో దిగి అక్కడినుండి స్కూల్ వాన్ లో జస్వంత్ పురలో వున్నటువంటి JNV చేరుకోవటం జరిగింది.
“ What is this ‘Rajasthan Genius Award’ ? ” sharp గా question వచ్చింది interview panel Chairperson బాలాగురుస్వామి గారి నుంచి.
UPSC personality test (interview) లో 2010 వ సం || ఏప్రిల్ 10వ తారీఖున మధ్యాహ్న session లో నేను లోపలికి వెళ్లిన ఓ పది నిమిషాల తరువాత వచ్చిన question .
“నేను జవహర్ నవోదయ విద్యాలయలో చదివాను. ఈ విద్యాలయాలలో తొమ్మిదవ తరగతి చదివే ఓ 33% శాతం విద్యార్థులను హిందీ యేతర విద్యాలయాల నుండి హిందీ ప్రాంత నవోదయ విద్యాలయాలకు, అలాగే హిందీ ప్రాంత నవోదయ విద్యాలయాల నుండి హిందీ యేతర విద్యాలయాలకు student exchange program కింద పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసి, కర్నూల్ జిల్లా నుండి రాజస్థాన్ లో జాలోర్ జిల్లా జస్వంతపుర లో ఉన్న JNV కి నన్ను, నాలాగా మా తరగతిలోని ఇంకో 20 మంది విద్యార్థులను 1995వ సంవత్సరం పంపించారు సర్ .
నేను ఆ విధంగా 9వ తరగతి రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా నవోదయ విద్యాలయలో చదివాను. ఇది జాతీయ సమైఖ్యతను పెంపొందించడం కోసం నవోదయ విద్యాలయాలలో వున్నటువంటి పద్ధతి సర్. అక్కడ చదివేటప్పుడు ఒక competition లో పాల్గొని మంచి మార్కులు సాధించినందుకు రాజస్థాన్ జీనియస్ అవార్డు ఇచ్చారు”.
అక్కడ చదువుకునే రోజుల్లో – మధ్యలో ఈ general knowledge test వ్రాయటం – అందులో మంచి score సాధించటం – వారు రాజస్థాన్ జీనియస్ అవార్డు అని ఒక certificate ఇవ్వడం అలా జరిగిపోయాయి.
ఇది తెలిసిన విషయమే కాబట్టి, ఇంకా చెప్పాలంటే interview board members దాని గురించి అడగాలనే personal information sheet లో ఆ విషయాన్ని ఉంచటం జరిగింది. అనుకున్నట్టు గానే వారు అడగటం, దానికి అప్పటికే thorough గా prepare అయి ఉన్నాను కాబట్టి చక చకా answer చెప్పేయటం జరిగిపోయాయి.
తరువాత ఆ విషయాన్ని తలచుకున్నప్పుడల్లా ఒక విధమైన మధుర అనుభూతి కలుగుతుంది.
ఎక్కడో చిన్న గ్రామం – కోటపాడులో పుట్టి – నవోదయకు ఎంపిక అయ్యి . అటు నుండి రాజస్థాన్ లో 9వ తరగతి చదివి – అందులో participate చేసిన ఒక పోటీ పరీక్ష – దానికి వచ్చిన certificate – దాని గురించి UPSC interview లో question – తలచుకుంటేనే ఒక విధమైన చక్కని అనుభూతి.
అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. అయిష్టంగా అయినా రాజస్థాన్ వెళ్ళడం – అదే UPSC లో ఉపయోగపడటం – ప్రతి incident ను కలుపుకుంటూ వెనక్కి వెళితే చాలా చక్కగా అమరుతాయి కదా !
Dots can be connected backward only.